KeepItOn 2023 MENA

2023లో భారదేశం ఇంటర్నెట్ షట్‌డౌన్ కౌంట్‌లో ప్రపంచాన్ని ఆరు సంవత్సరాలుగా నడిపిస్తూ వస్తున్నది

Read in Bengali, English, Hindi, Kannada, Marathi, Meitei (Romanized), Punjabi, Thadou or Urdu.

దాదాపు ప్రతి కొలత ప్రకారం, 2023 ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల యొక్క  అతి దారుణమైన/ అతినీచమైన సంవత్సరంగా నమోదైంది.  ఈ నేపథ్యంలో 39 దేశాల్లో కనీసం 283 సార్లు ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగించడాన్ని అధికారులు  ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు.  ఫలితంగా  హింస, యుద్ధ నేరాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, ఇతరత్ర దురాగతాలను  మొదలు పెట్టడం,  వాటిని  తీవ్రతరం చేయడం వల్ల మిలియన్ల కొద్దీ ప్రజల మానవ హక్కులను అణిచివేయ బడినవి. అలా కనీసం 116 సార్లు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ చేయడంలో,  అంతరాయం కలిగించడంలో ప్రపంచాన్ని నడిపించిన వరుసలో భారతదేశం  ఆరవ సంవత్సరంచేరుకుంది.  

ఈరోజు, మే 15న ప్రారంభించబడుతోంది, యాక్సెస్ నౌ మరియు  #KeepItOnకూటమి(#keepitOn)  యొక్క కొత్త నివేదిక, కుంచించుకుపోతున్న ప్రజాస్వామ్యం, పెరుగుతున్న హింస:  2023లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు, సంవత్సరం పొడవునా మానవ హక్కులపై ఈ క్రూరమైన, ప్రమాదకరమైన దాడుల యొక్క ప్రతికూలమైన ప్రభావాన్ని మరియు విధ్వంసాన్ని బహిర్గతం చేస్తాయి. పూర్తి నివేదిక, గ్లోబల్ స్నాప్‌షాట్, మరియు ఆసియా పసిఫిక్ డీప్‌డైవ్‌ను చదవండి.

2023లో భారతదేశం అంతటా, ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచాయి. ప్రభుత్వం వరుసగా ఆరవసారి ఇతర భూభాగాలలో లలో కంటే ఎక్కువ షట్‌డౌన్‌లను అమలు చేసింది. మణిపూర్ నుండి పంజాబ్ వరకు, భారత అధికారులు పాల్పడిన అన్యాయమైన షట్‌డౌన్‌ల కారణంగా ప్రజల యొక్క మాట్లాడే స్వేచ్ఛ, సమాచారం పొందే పొందే హక్కు సమావేశాల్లో పాల్గొనే హక్కులు ఆసాంతం ఉల్లంఘించబడ్డాయి. యాక్సెస్ నౌ యొక్కసీనియర్ పాలసీ కౌన్సెల్ నమ్రతా మహేశ్వరి

భారతదేశం యొక్క ముఖ్య నిర్ధారణలు:

  • గ్రంధస్తం చేయబడిన:  భారతదేశం, ఆరవసారి,  దాదాపు 116 షట్‌డౌన్‌లతో ప్రపంచంలోని షట్‌డౌన్ లీడర్‌గా అవమానకరమైన బిరుదును తీసుకుని చరిత్రకెక్కింది.  
  • పరిధి: గత ఐదు సంవత్సరాల్లో, భారతీయ అధికారులు 500 సార్లు కిల్ స్విచ్‌ను కొట్టారు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మిలియన్ల మందిని పదే పదే చీకటిలోకి నెట్టారు;
  • అత్యంత ప్రభావితం: మే డిసెంబర్ నెలల మధ్య, మణిపూర్‌లో దాదాపు 3.2 మిలియన్ల ప్రజలు 212 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా షట్‌డౌన్‌తో బాధపడ్డారు;
  • నేరస్థులు: 2023లో మొత్తం 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు షట్‌డౌన్‌లను విధించబడ్డాయి. వాటిలో ఏడు రాష్ట్రాలలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించారు.
  • వ్యవధి: ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఉన్న షట్‌డౌన్‌లు 2022లో మొత్తం షట్‌డౌన్‌లలో 15% నుండి 2023లో 41% కంటే ఎక్కువగా పెరిగాయి
  • డిజిటల్ విభజన: ఇంటర్నెట్ సదుపాయం ఉన్న దాదాపు 96% మంది వ్యక్తులు వైర్‌లెస్ సేవలపై ఆధారపడిన దేశంలో 59% షట్‌డౌన్‌లు ప్రత్యేకంగా మొబైల్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి; 
  • సవాలు: చారిత్రాత్మకమైన భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత, అధికారులు షట్‌డౌన్ ఆర్డర్‌లను ప్రచురించడంలో విఫలమవుతూనే ఉన్నారు.  మరియు పాటించడంలో విఫలమైనందుకు కోర్టులచే పదే పదే సరిదిద్దబడింది.
భారతదేశంలో అత్యధికంగా ఎన్నికైన నాయకులు ‘డిజిటల్ ఇండియా’కు కట్టుబడి ఉన్నామని పదేపదే ప్రకటించడం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే లక్షలాది మందికి అత్యంత హాని కలిగించే ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను నిర్దాక్షిణ్యంగా ఆదేశించడం వల్ల ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గత ఐదేళ్లలో 500కి పైగా డాక్యుమెంట్ చేయబడిన షట్‌డౌన్‌లు జరిగాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇంటర్నెట్ షట్‌డౌన్ లేనిదని నిర్ధారించడానికి భారత ప్రభుత్వo కట్టుబడి ఉండాలి. అప్పుడే గ్లోబల్ డిజిటలైజేషన్ లీడర్‌గా గుర్తింపు పొందేందుకు చేసే ప్రయత్నాలలో విశ్వసనీయత ఉంటుంది. డిజిటల్ యుగంలో మానవ హక్కులను ఇంట్లోనే అగౌరవపరుస్తూ ప్రపంచానికి డిజిటల్ యాక్సెస్‌ను ముందుకు తీసుకెల్తా మని చెప్పుకోలేరు. ఆసియా పసిఫిక్ పాలసీ డైరెక్టర్ రమణ్ జిత్ సింగ్ చిమా యాక్సెస్ నౌ తో చెప్పాడు

2023లో, అధికారులు మరియు తగవులాడుతున్న పార్టీలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా నుండి మయన్మార్ వరకు షట్‌డౌన్‌లను దుర్వినియోగం చేయడం కొనసాగించాయి. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లో నడిచే నిరసనలు మరియు అసమ్మతిని అణిచివేసేందుకు తమను తాము మరింత బలపరుచుకున్నాయి.  అయితే నేపాల్ కూడాటిక్‌టాక్‌ను నిరోధించడంతో అవమానకరమైన జాబితాలో చేపోయింది.

పూర్తి నివేదిక, గ్లోబల్ స్నాప్‌షాట్, మరియు ఆసియా పసిఫిక్ డీప్‌డైవ్‌ను చదవండి.