దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల గురించి జరిగే అసత్య ప్రకటనలను యూట్యూబ్ ఆమోదిస్తోందని యాక్సెస్ నౌ (Access Now) మరియూ గ్లోబల్ విట్‌నెస్ (Global Witness) సంయుక్తoగా చేపట్టిన కొత్త పరిశోధనలో వెల్లడైంది.
యాక్సెస్ నౌ మరియూ గ్లోబల్ విట్‌నెస్ సంయుక్తoగా చేపట్టిన కొత్త పరిశోధనలో, “Votes will not be counted”: Indian election disinformation ads and YouTube, ఎన్నికల ప్రక్రియ పై యూట్యూబ్ చెసే ప్రతి కూల ప్రకటనలు మరియూ ఎన్నికల ఓటింగ్ విధానాలపై అసత్యాలు, ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతపై దాడులను, ఉల్లంగనలను, నిరాధార ఆరోపణలను సూచించే ప్రకటనలను యూట్యూబ్ ఆమోదిస్తోందని గుర్తించింది. విచారణలో కోసం సమర్పించిన ప్రకటనలు యూట్యూబ్ లో అమలు కావడం లేదని నిర్ధారించుకోవడానికి, మరియూ అవి ప్రచురణ కాకముందే ఉపసంహరించబడ్డాయి.
భారత దేశంలోని మూడు అధికారిక భాషలైన ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో యూట్యూబ్‌కు 48 ప్రకటనలను సమర్పించిoది. ఇవి ఎన్నికల గురించి యూ ట్యూబ్ తప్పుడు సమాచారపు విధానాల ద్వారా నిషేధించబడిన, ఉల్లంఘించబడిన అంశాలు ఇమిడి ఉన్నాయనే స్పష్టతను కలిగి ఉన్నాయి. ప్రకటనలో ఉన్న విషయాలు అమలు కావడానికి ముందే దాన్ని సమీక్షించాలనే యూట్యూబ్ విధానం ఉన్నప్పటికీ, ప్రచురణ కోసం ప్రతి ఒక్క ప్రకటనను వేదిక ఆమోదించింది.
అసత్య సమాచారం గురించి దాని స్వంత విధానాలను అమలు చేయడంలో విఫలమవడం ద్వారా, రాబోయే భారత ఎన్నికలు స్వేచ్ఛగా , న్యాయంగా జరిగేలా చూసుకోవడంలో తన పాత్ర గురించి యూట్యూబ్ తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. 2024 కీలకమైన ఎన్నికల సంవత్సరంలోకి వెళుతున్నప్పుడు, ఎన్నికల సమగ్రతను కాపాడటం గురించి సాంకేతిక వేదికలు గొప్ప వాగ్దానాలు చేశాయి, కానీ రుజువు చేయలేకపోయింది. మా పరిశోధనలో భాగంగా సమర్పించిన యూట్యూబ్ తన విధానాలను ఉల్లంఘించే మొత్తం 48 ప్రకటనలను అప్రధానం చేసింది.Namrata Maheshwari, Senior Policy Counsel, Access Now
ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువగా భారతదేశంలో 462 మిలియన్ల మంది ప్రజలు యూట్యూబ్‌ని వినియోగిస్తున్నారు. కనుక ఓటరును ప్రభావితం చేసే అణచివేతను నియంత్రించడంలో మరియు ఓటు హక్కుకు అంతరాయం కలుగకుండా చూసుకోవడంలోనూ యూట్యూబ్ అపారమైన బాధ్యతను కలిగి ఉంది.
2024లో, గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలకు వెల్లనున్నారు. ఈ సందర్భంలో, తప్పుడు సమాచారంతో పోరాడడంలో యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా వేదికల పాత్ర కీలకం అవుతుంది. 2022 సం. లో జరిగిన మధ్యంతర ఎన్నికలకు ముందు గ్లోబల్ విట్‌నెస్ చేసిన ఇదే పరిశోధనలో నిషేధించబడిన అంశాలను గుర్తించి యూట్యూబ్ తిరస్కరించగలదని తెలియ చేసింది. 2022సం. లో బ్రెజిల్‌లో మరియు ప్రస్తుతం భారతదేశంలో జరిగిన మరో పరిశోధనలో, వేదిక దాని స్వంత ప్రమాణాలను సమర్థించడంలో విఫలమైందనీ, దాని స్వంత విధానాలను ఉల్లంఘించే ఎన్నికల సంబంధిత ప్రకటనలను ఆమోదించింది.
యూట్యూబ్ ప్రకటనలలోని అర్థాలకు దాని విధానాలకు పొంతన లేని అస్థిరతతో అది పునరావృత అపరాధిగా మారింది. యూట్యూబ్ లో లోపించేది సరైన విధానాలు లేదా వాటిని అమలు చేసే సామర్థ్యం కాదు. కానీ అంతర్జాతీయంగా అధిక సంఖ్యలో ఉన్నసభ్యులకు యూ యస్ లో మంజూరు చేస్తున్నట్లు చూసిన అదే రక్షణలను విస్తరించాలనేది మా సంకల్పం. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఎలక్షన్ ప్రక్రియ అతి పెద్ద మెగా సైకిల్ అయినందున ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి, అనేక పెద్ద పందేల పరుగులతో విస్తృత పరిణామాలు చోటు చేసుకుంటాయి.Henry Peck, Campaigner, Digital Threats at Global Witness
విచారణకు ప్రతిస్పందనగా, ప్రకటనలు తమ విధానాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి తమ ఆచరణ క్రమంలో దఫా దఫాలు గా ఆచరణ చేపట్టాల్సి ఉన్నాయని గూగుల్ తెలిపింది. ఇప్పటికీ గూగుల్ విధానాలను ఉల్లంఘించినట్లయితే ప్రారంభ ప్రకటనల తనిఖీ యొక్క అనుమతిని తమ విధానం ద్వారా బలవంతంగా ఆపేయవచ్చు లేదా తొలగించ వచ్చని గూగుల్ తెలిపింది.
విషయ విధానాన్ని ఉల్లంఘనల రీతిని తగినంతగా సమీక్షించడానికి బదులుగా, యూట్యూబ్ ఉల్లంఘించిన విషయాన్నీ తర్వాత తీసివేయవచ్చు ననే యోచనను సూచిస్తుంది. ఎన్నికల సమయంలో ఇది ప్రమాదకరమైనదే కాక బాధ్యతారాహిత్యం కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సమర్పించిన కొన్ని గంటల్లోనే ప్రకటన ప్రచురించబడుతుంది. అంతే కాక ప్రకటన ప్రత్యక్ష ప్రసారం అయిన తర్వాత, ముఖ్యంగా యూట్యూబ్ యొక్క విస్తృతమైన చేరిక కారణంగా అనూహ్యమైన నష్టం వాటిళ్లుతుంది.
భారత ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, మానవ హక్కుల పట్ల దాని బాధ్యతతో కూడిన కట్టుబాట్లను అమలు చేయడానికి ఎన్నికల ప్రారంభానికి ముందే ‘యూట్యూబ్ ను తప్పక సరిదిద్దాలి.’ అని యాక్సెస్ నౌ మరియూ గ్లోబల్ విట్‌నెస్ కలిసి ఈ క్రింది సూచనలతో సహా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడిగా యూట్యూబ్ కు పిలుపునిచ్చాయి.
- యాక్సెస్ నౌ ద్వారా ప్రచురించబడిన ప్రస్తుత మార్గదర్శకానికి అనుగుణంగా విషయ పాలనా విధానాన్ని అనుసరించండి:
- • ప్రకటనల ఆమోద ప్రక్రియ మరియు ఎన్నికల/రాజకీయ ప్రకటనల నడవడి విధానం యొక్క సమగ్ర మూల్యాంకనాన్ని నిర్వహించండి;
- భారతదేశంలోని భాషల్లో ఎన్నికల సంబంధిత ప్రతికూల పదజాలాన్ని నియంత్రించడానికి మరిన్ని వనరులను పెట్టుబడి పెట్టండి; మరియు
- విధి విధానాలలోని అభిప్రాయాన్ని అర్థవంతంగా పొందుపరచడానికి పౌర సమాజం, జర్నలిస్టులు, వాస్తవ తనిఖీదారులు మరియు ఇతర వాటాదారులతో సంప్రదించండి.
- దర్యాప్తు యొక్క పద్దతి మరియు పూర్తి సిఫార్సులతో కూడిన పూర్తి నివేదిక ను చూచి తెలుసుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉందని గమనించ గలరు.
మీరు ప్రకటనల యొక్క ఖచ్చితమైన పదాలను చూడాలనుకుంటే, దయచేసి మాకు ఇమెయిల్ చేయండి. గూగుల్ యొక్క పూర్తి ప్రతిస్పందనను కూడా నివేదికలో చూడవచ్చు.